T20 World Cup 2021: కోహ్లీ కల చెదిరే.. టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ సాధించకుండానే కెప్టెన్సీకి వీడ్కోలు.. 9 ఏళ్ల తర్వాత సెమీస్ చేరని టీమిండియా

|

Nov 07, 2021 | 8:16 PM

టీ20 ప్రపంచకప్ 2021 సెమీ-ఫైనల్స్ నుండి టీమ్ ఇండియా ఔట్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మరియు న్యూజిలాండ్

1 / 5
దిగ్గజ బ్యాట్స్‌మెన్స్, బౌలర్లతో కూడిన టీమ్ ఇండియా టీ20 ప్రపంచ కప్ 2021 నుంచి నిష్క్రమించింది. ఆదివారం అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగో విజయాన్ని నమోదు చేసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2021 గెలవాలన్న టీమ్ ఇండియా కల చెదిరిపోయింది. న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. దీంతో పాకిస్తాన్-న్యూజిలాండ్ గ్రూప్ 2 నుంచి సెమీ-ఫైనల్‌కు చేరుకోగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు గ్రూప్ 1లో విజయం సాధించాయి. దీంతో టీ20 కెప్టెన్ విరాట్ కోహ్లీ తన చివరి ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవలేకపోయాడు. ఇది మాత్రమే కాదు, 9 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా ఇంత దారుణమైన రోజు చూడాల్సి వచ్చింది.

2 / 5
ఐసీసీ టోర్నమెంట్‌లో 9 సంవత్సరాల తరువాత  సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 2012లో శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. కానీ, ఆ తర్వాత టీమ్ ఇండియా ప్రతి ఐసీసీ టోర్నీలో నాకౌట్ రౌండ్‌లోకి ప్రవేశించింది.

3 / 5
2013లో టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలిచింది. 2014 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. 2015 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. 2016 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి సెమీఫైనల్‌కు చేరుకుంది.

4 / 5
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ చేరింది. 2019 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఫైనల్‌కు ప్రయాణించింది.

5 / 5
అయితే 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సూపర్-12 రౌండ్‌లోనే నిష్క్రమించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో ఛాంపియన్ కావాలనే కలను ఛేదించలేకపోయింది.