
టీ20 అనేది ఫోర్లు, సిక్సర్ల ఆట. ఈ ఫార్మాట్‌లో కొట్టిన ఫోర్లు, సిక్సర్‌ల సంఖ్య మరే ఇతర ఫార్మాట్‌లోనూ కనిపించదు. బ్యాట్స్‌మెన్ బరిలోకి దిగితే వీలైనన్ని బౌండరీలను కొట్టడానికి ప్రయత్నిస్తాడు. టీ 20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడ కూడా అదే జరగనుంది. ఫోర్లు, సిక్సర్లు కొట్టే లిస్టులో అగ్రస్థానంలో ఉండాలని చూస్తుంటారు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక ఫోర్ల విషయంలో టాప్ -5 లో చేరిన బ్యాట్స్‌మెన్‌ల గురించి తెలుసుకుదాం.

ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే మొదటి స్థానంలో ఉన్నారు. 2007 నుంచి 2014 వరకు ఆడిన టీ 20 ప్రపంచకప్‌లో 31 మ్యాచ్‌లలో మహేలా 111 ఫోర్లు కొట్టాడు. అతను 136.74 స్ట్రైక్ రేట్ వద్ద 1016 పరుగులు చేశాడు.

రెండో స్థానంలోనూ శ్రీలంక ఆటగాడే ఉన్నాడు. ఈ బ్యాట్స్‌మెన్ పేరు తిలకరత్నే దిల్షాన్. 2007 నుంచి 2016 వరకు టీ 20 ప్రపంచకప్‌లో దిల్షాన్ పాల్గొన్నాడు. అతను 35 మ్యాచ్‌ల్లో 101 ఫోర్లు కొట్టాడు. 30.93 సగటుతో 897 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 124.06గా ఉంది.

తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మాత్రం మూడో స్థానంలో ఉన్నాడు. ఈ వెస్టిండీస్ ప్లేయర్ 2007 లో మొదటి ఎడిషన్‌లో పాల్గొన్నాడు. ఈసారి అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లో జరిగే ప్రపంచ కప్‌లో కూడా పాల్గొంటాడు. ప్రపంచకప్‌లో గేల్ ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 75 ఫోర్లు కొట్టాడు. అతను 146.73 స్ట్రైక్ రేట్ వద్ద 920 పరుగులు చేశాడు.

గేల్ తర్వాత భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2012లో కోహ్లీ తొలి టీ 20 ప్రపంచకప్ ఆడాడు. అతను ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 73 ఫోర్లు కొట్టాడు. 133.04 స్ట్రైక్ రేట్‌తో 777 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ ఆటగాడు 2007 నుంచి 2014 వరకు టీ20 ప్రపంచకప్‌లో 25 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 67 ఫోర్లు కొట్టాడు. ఈ కాలంలో మెకల్లమ్ బ్యాట్ నుంచి 637 పరుగులు రాలాయి. అతని స్ట్రైక్ రేట్ 128.42గా ఉంది.