
Surya Kumar Yadav: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో సూర్య తన ఐపీఎల్ సహచరుడైన కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు. దీంతో వన్డే క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాదిన 3వ భారత ఆటగాడిగా నిలిచాడు.

కాగా, వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున ఒకే ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మ్యాన్ జహీర్ ఖాన్. 2000లో జింబాబ్వే ఆటగాడు హెన్రీ ఒలోంగా వేసిన ఓ ఓవర్‌లో జహీర్ ఖాన్ 4 బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు.

రోహిత్ శర్మ: జహీర్ ఖాన్ తర్వాత రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. 2017లో శ్రీలంక ఆటగాడు సురంగ లక్మల్ వేసిన ఓవర్‌లో హిట్‌మ్యాన్ వరుసగా 4 సిక్సర్లు బాదాడు.

ఇక తాజాగా ఇదే ఫీట్‌ను సూర్య కనబర్చాడు. తద్వారా ఒకే ఓవర్‌లో 4 సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా జహీర్, రోహిత్ రికార్డులను సమం చేయడంతో పాటు.. ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా అవతరించాడు.