5 సిక్స్‌లు, 78 పరుగులు.. డబుల్ ధమాకాతో పాకిస్తాన్ పాలిట విలన్‌లా లేడీ కోహ్లీ..!

Updated on: Sep 05, 2026 | 1:51 PM

IND W vs PAK W: స్మృతి మంధాన పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఆమె రెండు భారీ రికార్డులను టార్గెట్ చేసుకుంది. పాక్ మ్యాచ్‌లో వీటిని బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇదే జరిగితే పాక్ జట్టుకు మరో ఓటమి తప్పదు.

1 / 5
Smriti Mandhana Records: మహిళల టీ20 ఆసియా కప్ 2026లో నేడు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోన్న పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన గట్టి ముప్పుగా మారే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్‌లో ఆడినట్లుగా స్మృతి మరో భారీ ఇన్నింగ్స్ ఆడితే, పాకిస్తాన్ టీంను కష్టాల్లో నుంచి బయట పడేయడం ఎవ్వరి తరం కాదు.

2 / 5
స్మృతి మంధాన సాధించబోయే డబుల్ విక్టరీతో పాక్ జట్టుకు భయం పట్టుకుంది. అంటే, ఆమె టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 100 సిక్సర్లు సాధించడంతోపాటు ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలవనుంది. స్మృతి ఈ రెండు రికార్డులను సాధించడంలో విజయం సాధిస్తే, పాకిస్తాన్‌ జట్టుకు మరో ఓటమి తప్పదంతే.

3 / 5
టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డు ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ పేరిట ఉంది. ఆమె 186 మ్యాచ్‌లలో 178 ఇన్నింగ్స్‌లలో 4,758 పరుగులు సాధించింది. స్మృతి మంధాన 173 మ్యాచ్‌లలో 167 ఇన్నింగ్స్‌లలో 4,681 పరుగులు చేసింది. అంటే, ఆమె సుజీ బేట్స్ ప్రపంచ రికార్డుకు కేవలం 78 పరుగుల దూరంలో ఉంది.

4 / 5
పాకిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌ల్లానే తన ప్రదర్శనను స్మృతి మంధాన రిపీట్ చేస్తే, పాకిస్థాన్ కచ్చితంగా ఇబ్బందుల్లో పడుతుంది.  అలాగే ఈ మ్యాచ్‌లో సుజీ బేట్స్ పేరిట ఉన్న అత్యధిక టీ20ఐ పరుగుల ప్రపంచ రికార్డు కూడా బద్దలవుతుంది.

5 / 5
టీ20లలో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు, పాకిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకునే అవకాశాన్ని కూడా స్మృతి మంధానా దక్కించుకోనుంది. ప్రస్తుతం ఆమె 95 సిక్సర్లు కొట్టింది. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆమె 5 సిక్సర్లు కొడితే, టీ20లలో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారత మహిళగా నిలుస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us