
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ ఉమెన్స్ క్రికెట్ లీగ్‌లో భాగంగా వెల్స్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్, వైట్ బాల్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది.

ఈ టోర్నీలో సదరన్ బ్రేవ్స్ తరఫున ఆడుతున్న 27 ఏళ్ల ఎడమచేతి వాటం స్మృతి.. ఈ మహిళల టోర్నీలో 500 పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.

వరుసగా మూడో ఎడిషన్‌లో బ్రేవ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంధాన ఇప్పటి వరకు ఆడిన 17 మ్యాచ్‌ల్లో మొత్తం 503 పరుగులు చేసింది. కొనసాగుతున్న 2023 ఎడిషన్‌లో రెండు బ్యాక్-టు-బ్యాక్ అర్ధ సెంచరీలతో, స్మృతి 78 బంతుల్లో 125 పరుగులతో CDC చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది.

2022 ఎడిషన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన స్మృతి 139 బంతులు ఎదుర్కొని మొత్తం 211 పరుగులు చేసింది. 2021 ఎడిషన్‌లో కూడా ఆమె 125 బంతుల్లో మొత్తం 167 పరుగులు చేసింది. మహిళల ది హండ్రెడ్ లీగ్‌లో స్మృతి మినహా మరే ఇతర క్రీడాకారిణి 500 పరుగుల రికార్డును లిఖించలేదు.

ఈ రికార్డుతో పాటు వెల్స్ ఫైర్ జట్టుపై అత్యధిక అర్ధశతకాలు సాధించిన మహిళల్లో 4 అర్ధశతకాలు సాధించిన భారత సహచరురాలు జెమీమా రోడ్రిగ్స్ రికార్డును కూడా స్మృతి బద్దలు కొట్టింది.

సదరన్ బ్రేవ్, వెల్స్ ఫైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్స్ ఫైర్ జట్టు 100 బంతుల్లో 165 పరుగులు చేసింది. జట్టు తరఫున హేలీ మాథ్యూస్ 38 బంతుల్లో 65 పరుగులు చేసింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సదరన్ బ్రేవ్ జట్టులో స్మృతి అజేయంగా 70 పరుగులు, డానీ వాట్ 67 పరుగుల ఇన్నింగ్స్‌తో రాణించినా చివరకు 161 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.