
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. విశేషమేమిటంటే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు కివీస్‌కు ఫాలోఆన్ విధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 483 పరుగులకు ఆలౌటైంది.

రెండో ఇన్నింగ్స్‌లో 257 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 256 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాటు టెస్టు క్రికెట్‌లో కేవలం 1 పరుగు తేడాతో గెలిచిన 2వ జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.

ఇంతకు ముందు వెస్టిండీస్ జట్టు టెస్టు క్రికెట్‌లో కేవలం 1 పరుగు తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 213 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు కేవలం 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో 2వ ఇన్నింగ్స్‌లో 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 184 పరుగులకే ఆలౌట్ కాగా, వెస్టిండీస్ జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది.

టెస్టు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్, న్యూజిలాండ్ మినహా మరే ఇతర జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించలేదు. అయితే ఒక్కసారి ఇంగ్లాండ్ జట్టు 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది.

2005లో, మైఖేల్ వాన్ జట్టు ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 407 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 308 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కేవలం 182 పరుగులకే ఆలౌటైంది. దీంతో చివరి ఇన్నింగ్స్‌లో 281 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 279 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు కేవలం 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి సంబరాలు చేసుకుంది.

అటు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అతి తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించింది. 2004లో వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 203 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 205 పరుగులకు ఆలౌట్ కాగా.. చివరి ఇన్నింగ్స్‌లో 106 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టును 93 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.