IPL 2025: రాజస్థాన్ ఖాతాలో ఎట్టకేలకో విజయం.. కట్‌చేస్తే.. గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..

Updated on: Apr 02, 2025 | 6:53 PM

Rajasthan Royals Sanju Samson: సంజు శాంసన్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. ఇప్పుడు కెప్టెన్, వికెట్ కీపర్‌గా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏప్రిల్ 5న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో శాంసన్ ఈ సీజన్‌లో తొలిసారి జట్టుకు కెప్టెన్‌గా, కీపర్‌గా కనిపించనున్నాడు.

1 / 5
Rajasthan Royals Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌కు ఎట్టకేలకు ఓ శుభవార్త అందింది. ఐపీఎల్ (IPL) 2025 లో కెప్టెన్, వికెట్ కీపర్ గా బాధ్యతలు స్వీకరించేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంజూ శాంసన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంసన్ వేలికి గాయం, శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న తర్వాత ఈ నిర్ణయం వచ్చింది.

2 / 5
శాంసన్ ఇప్పుడు తొలిసారిగా ఐపీఎల్ 2025లో రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సమయంలో, ఏప్రిల్ 5న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు.

3 / 5
ఐపీఎల్ 2025 సీజన్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు శాంసన్ బ్యాట్స్‌మన్‌గా ఆడేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఈ కాలంలో, అతను వికెట్ కీపింగ్, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో శాంసన్ కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే మ్యాచ్ ఆడుతున్నాడు. ఇంతలో, రియాన్ పరాగ్‌ను జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. కానీ, ఇప్పుడు శాంసన్ ఎన్‌సీఏ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాడు. అతను ఇకపై రాయల్స్ తరపున వికెట్ కీపింగ్‌‌తో పాటు కెప్టెన్‌గా కనిపించేందుకు రెడీ య్యాడు.

4 / 5
ఇంపాక్ట్ ప్లేయర్‌గా, శాంసన్ బ్యాట్‌తో బాగా రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 66 పరుగులు, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 13 పరుగులు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 20 పరుగులు చేశాడు. శాంసన్ లేనప్పుడు, ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.

5 / 5
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ ఐపీఎల్‌లో 4500 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో 14వ ఆటగాడిగా నిలిచాడు. శాంసన్ 2013లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 171 మ్యాచ్‌లు ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ గురించి చెప్పాలంటే, రాయల్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆ జట్టు మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచింది. శాంసన్ కెప్టెన్‌గా ఆడితే జట్టు వ్యూహంలో ఖచ్చితంగా తేడా ఉంటుందని అంతా భావిస్తున్నారు.