Asia Cup 2023 Final: అజారుద్దీన్, ధోని సరసన చేరిన రోహిత్ శర్మ.. భారత్ క్రికెట్ చరిత్రలో మూడో కెప్టెన్‌గా అరుదైన రికార్డ్..

|

Sep 18, 2023 | 8:58 AM

IND vs PAK, Asia Cup 2023 Final: ఆదివారం అందరూ చూస్తుండగా 116 నిముషాల వ్యవధిలోనే రోహిత్ సేన లంకను దాటేసింది. అప్పటి వరకు బలంగా ఉన్న శ్రీలంకను.. బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన రోహిత్ జట్టు దాటగలదా అని సందేహించినవారికి ఆశ్చర్యం కలిగేలా ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించింది. మహ్మద్ సిరాజ్ 6, హార్దిక్ పాండ్యా 3, జస్ర్పీత్ బూమ్రా ఓ వికెట్ తీయడంతో లంక 50 పరుగులకే ఆలౌట్ కాగా.. 51 రన్స్ లక్ష్యాన్ని ఆ వెంటనే ఇషాన్ కిషన్ 23*, శుభమాన్ గిల్ 27* పరుగులతో 6.1 ఓవర్లలోనే చేధించారు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డ్‌ను సాధించడంతో పాటు.. మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోని సరసన సమంగా నిలిచాడు.

1 / 5
IND vs PAK, Asia Cup 2023 Final: భారత్, శ్రీలంక మధ్య ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా 8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలుచుకోగా.. రోహిత్ శర్మకు ఇది కెప్టెన్‌గా రెండో ఆసియా కప్ విజయం.

2 / 5
ఇలా భారత్‌కు రెండు ఆసియా కప్ టైటిల్స్ అందించిన రోహిత్.. తన కంటే ముందు ఈ ఘనతను సాధించిన మహ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని రికార్డులను సమం చేశాడు.

3 / 5
హైదరాబాద్‌కి చెందిన మహ్మద్ సిరాజ్ 1991, 1995 ఆసియా కప్ టోర్నీల్లో భారత్‌కు టైటిల్స్ అందించాడు. తద్వారా భారత్ తరఫున రెండు ఆసియా కప్ టైటిల్స్ గెలుచుకున్న తొలి టీమిండియా కెప్టెన్‌గా కూడా రికార్డ్ సృష్టించాడు.

4 / 5
ఆ తర్వాత 2010, 2016 టోర్నీల్లో ఆసియా కప్ టైటిల్స్ గెలిచిన ఎంఎస్ ధోని.. రెండు టైటిల్స్ గెలిచిన భారత కెప్టెన్‌గా అజారుద్దీన్ రికార్డ్‌ను సమం చేశాడు. అలాగే ఈ ఘనత సాధించిన రెండో భారత సారధిగా నిలిచాడు.

5 / 5
2018 ఆసియా కప్ టోర్నీలో టీమిండియాకు టైటిల్ అందించిన రోహిత్ శర్మ.. తాజాగా 2023 టైటిల్‌ని గెలుచుకున్నాడు. తద్వారా రెండు టైటిల్స్ గెలిచిన భారత కెప్టెన్‌గా అజారుద్దీన్, ధోని రికార్డ్‌లను రోహిత్ శర్మ సమం చేశాడు. ఇంకా ఈ ఘనత సాధించిన మూడో కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు.