
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ నాల్గో రోజు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ-యశస్వీ జైస్వాల్ చారిత్రాత్మక ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్‌లో 57 పరుగుల వద్ద రోహిత్ శర్మ పెవిలియన్ చేరిన రోహిత్.. ఆ రెండంకెల స్కోర్‌తోనే ప్రపంచ టెస్ట్ చరిత్రలో ముందెన్నడూ లేని రికార్డుని సృష్టించాడు.

అవును, వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ వరుసగా 30 సార్లుగా 10 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు(రెండంకెల స్కోర్) చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్రలో నిలచాడు.

రోహిత్ తన చివరి 30 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో.. 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 46, 120, 32, 31, 12, 12, 35, 15, 43, 103, 80, 57 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో రోహిత్.. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే పేరటి ఉన్న రికార్డ్‌ని కూడా బద్దలు కొట్టాడు. జయవర్ధనే 29 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా రెండంకెల స్కోర్ చేసిన రికార్డ్‌ని కలిగి ఉన్నాడు.

రోహిత్ 30 సార్లు ఈ ఘనత సాధించడంతో అత్యధిక సార్లు వరుసగా రెండంకెల స్కోర్ సాధించిన టెస్ట్ ప్లేయర్‌గా కూడా అగ్రస్థానంలో నిలిచాడు. జయవర్ధనే(29సార్లు) రెండో స్థానంలో ఉండగా.. లెన్ హట్టన్(25), రోహన్ కన్హాయ్(25), ఏబీ డీవిల్లియర్స్(24) తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నారు.