టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్‌లో చాలా రికార్డులు సాధించాడు. ఆ రికార్డులు అతన్ని గొప్ప బ్యాట్స్‌మెన్‌గా మార్చాయి. నేటితో ఈ స్టార్ బ్యాట్స్‌మన్‌కి 35 ఏళ్లు నిండాయి. అయితే రోహిత్ జీవితాన్ని మార్చేసిన వ్యక్తి పాత్ర చాలా ముఖ్యమైనది.
రోహిత్ శర్మ నాగ్‌పూర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతను ముంబైలో పెరిగాడు. అక్కడే అతను క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. మెరుగైన శిక్షణ కోసం స్వామి వివేకానంద కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని కోచ్ సూచించాడు. కానీ రోహిత్ దగ్గర డబ్బులు లేవు. ఈ పరిస్థితిలో దినేష్ లాడ్ అతడికి అండగా నిలిచాడు. స్కాలర్ షిప్ అందించాడు. దీంతో రోహిత్ ఒక్క పైసా కూడా చెల్లించకుండా నాలుగు సంవత్సరాలు అక్కడే చదివాడు.
వాస్తవానికి రోహిత్ శర్మ ఆఫ్‌స్పిన్నర్. కానీ దినేశ్ లాడ్ రోహిత్‌లో బ్యాట్స్‌మెన్‌ని చూశాడు. నేరుగా రోహిత్‌ను ఓపెనింగ్ చేయమని అడిగాడు.
అక్కడి నుంచి రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం 17 ఏళ్ల వయసులో ముంబై తరఫున ఆడడం ప్రారంభించాడు.
ధోనీ ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడంతో భారత జట్టులో రోహిత్ అదృష్టం మారిపోయింది. ఇప్పటి వరకు మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. అదే సమయంలో అతను మూడు ఫార్మాట్లలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.