
టీమిండియాలో సిక్సర్ల రారాజు అంటే ఠక్కున గుర్తొచ్చేది రోహిత్ శర్మ. ఇప్పుడు ఓ యువ ప్లేయర్ హిట్‌మ్యాన్‌ను పడగొట్టి నయా సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు. ఈ ఏడాది అతడే అత్యధిక సిక్సర్లు బాదేశాడు. అతడు యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్.. ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఎవరో కాదు రిషబ్ పంత్.

ఈ ఏడాది రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి 36 సిక్సర్లు బాదాడు. ఇందులో 15 సిక్సర్లు టెస్టుల్లో కొట్టగా.. 11 వన్డేలు, 10 సిక్సర్లు టీ20లలో నమోదు చేశాడు.

రోహిత్ శర్మ ఈ ఏడాది 34 సిక్సర్లు మాత్రమే సాధించాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు(22) బాదిన రోహిత్ శర్మ.. టెస్టుల్లో 11 సిక్సర్లు, వన్డేల్లో ఒక్క సిక్స్ మాత్రం కొట్టాడు.

ఈ ఏడాది భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో పంత్, రోహిత్ ఉన్నారు. రోహిత్ శర్మ మొత్తం మూడు ఫార్మాట్లలో 35 ఇన్నింగ్స్‌లలో 1420 పరుగులు చేశాడు, అందులో 2 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో, పంత్ 31 ఇన్నింగ్స్‌లలో 41.30 సగటుతో 1074 పరుగులు చేశాడు, ఇందులో 1 సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.