ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ రవిచంద్రన్ అశ్విన్ vs నాథన్ లియోన్ సిరీస్‌గా మారుతుంది. ఎందుకంటే ఇద్దరికీ ఇదే చివరి బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్.
బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాథన్ లియాన్, రవిచంద్రన్ అశ్విన్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. అందుకే నంబర్ 1 ఎవరనేది కూడా ఈ సిరీస్ ద్వారా ఖరారు కానుంది.
ప్రస్తుతం ఈ జాబితాలో నాథన్ లియాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో 26 మ్యాచ్‌లు ఆడిన లియాన్ 7378 బంతులు వేసి మొత్తం 116 వికెట్లు పడగొట్టాడు.
బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో 22 మ్యాచ్‌లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 7163 బంతుల్లో మొత్తం 114 వికెట్లు పడగొట్టాడు. అంటే అశ్విన్, లియాన్ మధ్య వికెట్ల తేడా కేవలం 2 మాత్రమే.
దీని ప్రకారం ఈ సిరీస్‌లో ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారో వారే టాప్‌లో కనిపిస్తారు. అందుకే ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య జరిగే ఈ టెస్టు సిరీస్ నాథన్ లియాన్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ పోటీగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.