ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ కోసం ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీని విడుదల చేసింది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా బ్లూ జెర్సీలో రోహిత్ శర్మ సేన కనిపించనుంది.దీనికి సంబంధించిన ఫోటోలను ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి నెట్టింట షేర్ చేయగా.. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే కొత్త జెర్సీలో పెద్దగా మార్పులు చేయలేదు. గతంలోని జెర్సీ మాదిరిగానే ఇప్పుడు రిలీజ్ చేసిన జెర్సీ డిజైన్‌లో కూడా బ్లూ, గోల్డ్ స్ట్రిప్‌ను ఉన్నాయి.
అలాగే జెర్సీ పై భాగంలోని డిజైన్‌లో ముంబై సిటీని తాకుతున్న అలలు, స్లైస్ లోగో, టీమ్ లోగో, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంగ్ స్ర్టిప్ ఉన్న చిత్రాలను చూడవచ్చు.
ఇక ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ కోసం ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. అలాగే ఈ మ్యాచ్ ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరగనుండడం విశేషం.
ముంబై ఇండియన్స్ జట్టు 2023: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఆకాష్ మధ్వల్ , రాఘవ్ గోయల్, నేహాల్ వధేరా, షామ్స్ ములానీ, విష్ణు వినోద్, డువాన్ జాన్సెన్, పీయూష్ చావ్లా, కామెరూన్ గ్రీన్.