రెడ్ బాల్‌తో సత్తా చాటుతూ భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్. ఇప్పుడు వైట్ బాల్ గేమ్ లోనూ తన పవర్ చూపిస్తున్నాడు .
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రాణించిన సిరాజ్ కోల్‌కతా వేదికగా జరగుతున్న రెండో మ్యాచ్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో ప్రత్యర్థుల వికెట్లు తీస్తున్నాడు. తాజా మ్యాచ్‌లో సిరాజ్ తన మూడో ఓవర్‌లో అవిష్క ఫెర్నాండోను బౌల్డ్ చేశాడు. గత మ్యాచ్‌లోనూ పవర్‌ప్లేలోనే ఫెర్నాండో వికెట్ పడగొట్టగా, కుశాల్ మెండిస్ కూడా బౌల్డ్ అయ్యాడు.
ఈ మ్యాచ్ ద్వారా గత ఏడాదిలో పవర్‌ప్లేలో అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సిరాజ్ రికార్డుల కెక్కాడు. పవర్‌ప్లేలో సిరాజ్‌కి ఇది 19వ వికెట్.
ల్‌కతా ODIలో జనవరి 2022 నుండి జనవరి 2023 వరకు 17 ఇన్నింగ్స్‌లలో సిరాజ్ పవర్‌ప్లేలో 78 ఓవర్లు బౌల్ చేశాడు, మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు కూడా ఓవర్‌కు 3.8 పరుగులు మాత్రమే.
కాగా సిరాజ్ తన వన్డే కెరీర్‌లో 18 మ్యాచ్‌లలో 24.18 సగటుతో 29 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్ వంటి ట్యాలెంటెడ్ బౌలర్లు ఉన్న ప్రస్తుత భారత బౌలర్లలో అతను అత్యుత్తమంగా రాణించడం విశేషం.