టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాడు. మంగళవారం రాత్రి శిఖర్ ధావన్, అయోషా ముఖర్జి విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించారు. వీరు 2012లో వివాహం చేసుకున్నారు. తొమ్మిది సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరు ప్రస్తుతం విడిపోయారు. అయోషా ధావన్ కంటే 10 సంవత్సరాలు పెద్దది.
టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్ధీన్ సైతం తన మొదటి భార్య నౌరీన్కు విడాకులు ఇచ్చాడు. వీరు 1987లో వివాహం చేసుకున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత 1996లో విడిపోయారు. ఇందుకు కారణం.. సినీ నటి సంగీత బిజ్లానీతో అజారుద్ధీన్ ప్రేమలో పడడమే.
అలాగే టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ తన మొదటి భార్య నికితకు విడాకులు ఇచ్చాడు. 2007లో వివాహాం చేసుకున్న ఈ జంట 2012లో విడిపోయారు. ఇందుకు కారణం.. నికిత.. కార్తీక్ స్నేహితుడు తమిళనాడు క్రికెటర్ మురళీ విజయ్ మధ్య వ్యవహరమే.
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ 1999లో జ్యోత్స్న అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కానీ 2003లో శ్రీనాథ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత 2007లో ఈ జంట విడాకులు తీసుకుంది.
వినోద్ కాంబ్లి మొదటి వివాహం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. కాంబ్లి 1998లో నోయెల్లా లూయిస్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక హోటల్‌లో రిసెప్షనిస్ట్. కానీ వీరి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు . ఏకాభిప్రాయంతో విడాకులు తీసుకున్నారు.
టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ2014లో హసిన్ జహాన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తనను షమీ కుటుంబసభ్యులు హింసిస్తున్నారని ఆరోపణలు చేసింది హసిన్. వీరిద్దరు విడాకులు తీసుకోలేదు. కానీ వేరు వేరుగా ఉంటున్నారు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ 2006 లో ఎలిజబెత్ క్యాంప్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కానీ 2008 లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. లీ కుటుంబానికి సమయం ఇవ్వలేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.