IPL 2022: కోల్‌కతాపై మరోసారి మెరుపులు.. పృథ్వీ షా తుఫాన్ బ్యాటింగ్‌తో మారిన లెక్కలు.. సెహ్వాగ్‌‌తో సమానంగా..

|

Apr 10, 2022 | 6:04 PM

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పృథ్వీ షా వరుసగా రెండో అర్ధశతకం సాధించాడు. అంతకుముందు, అతను లక్నో సూపర్ జెయింట్‌పై కూడా ఫిఫ్టీ కొట్టాడు.

1 / 4
ఢిల్లీ క్యాపిటల్స్ తుఫాన్ ఓపెనర్ పృథ్వీ షా ఐపీఎల్ 2022లో తన వేగాన్ని పెంచాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, బౌండరీలతో దూసుకెళ్తున్నాడు. మునుపటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై నిప్పుల వర్షం కురిపించిన తర్వాత, ఈ సీజన్‌లో అత్యుత్తమ బౌలింగ్ అటాక్ ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కూడా చిత్తు చేశాడు. టోర్నమెంట్‌లో వరుసగా రెండో అర్ధ సెంచరీని సాధించాడు.

2 / 4
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయగా, ఓపెనింగ్‌కు వచ్చిన షా తొలి ఓవర్‌ నుంచే దుమ్మురేపడం ప్రారంభించాడు. షా కేవలం 27 బంతుల్లోనే తన 12వ అర్ధ సెంచరీని సాధించి, 50 మార్కును దాటడంతో పాటు  జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. కేవలం 29 బంతుల్లోనే 51 పరుగులు (7 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. అతను 9వ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.

3 / 4
విశేషమేమిటంటే.. కేకేఆర్‌పై పృథ్వీ షాకు ఇది ఐదో అర్ధ సెంచరీ. ఈ జట్టుపై షా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేశాడు. అదే సమయంలో, షా ఈ సీజన్‌లో వరుసగా రెండో అర్ధ సెంచరీని సాధించాడు. అంతకుముందు లక్నోపై కేవలం 34 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు.

4 / 4
ఇది కాకుండా, యువ ఢిల్లీ ఓపెనర్ IPL మ్యాచ్‌ల పవర్‌ప్లేలో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. ఢిల్లీ తరపున అలా చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా మారాడు. అతని కంటే ముందు వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు.