టీమిండియాలోకి తిరిగి రావాలంటే.. కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ పెద్దల మాట. అయితే ఈ అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్. రంజీల్లో ఆడకుండా, ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. దీంతో తమ మాట భేఖాతర్ చేసినందుకు గానూ అయ్యర్, కిషన్ సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఇప్పటికే బోర్డు పెద్దలు సమాలోచనలు చేయడం, తొలగింపునకు సంబంధించి కీలక ప్రకటన త్వరలోనే రానుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ వీళ్లిద్దరికి సెంట్రల్ కాంట్రాక్టులు రాకపోతే.. ఇక టీమిండియాకు ఆడేందుకు అనర్హులే. దీంతో టీమిండియాలో ఇక ఇషాన్, అయ్యర్ కెరీర్ క్లోజ్ అయినట్టే.