IPL 2026: తోపులు కాదు అంతకుమించి.. బరిలోకి దిగారంటే బౌలర్లకు జర్రమే..!

Updated on: May 11, 2026 | 6:15 PM

IPL Sixer King: ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లను చూస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ లిస్ట్‌లో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుత సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సత్తా చాటుతున్నాడు. మిగతా బ్యాటర్లు ఎవరు, అసలు ఎవరెన్ని సిక్స్‌లు కొట్టారో ఓసారి చూద్దాం..

1 / 9
IPL Sixer King: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. పరుగులు చేయడమే కాకుండా సిక్సర్లు కొట్టడంలోనూ అతను ముందున్నాడు. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 9
వైభవ్ సూర్యవంశీ (40 సిక్సర్లు): ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వారి జాబితాలో వైభవ్ సూర్యవంశీ సంయుక్తంగా ఏడవ స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 40 సిక్సర్లు బాదాడు. కాగా, ఈ లిస్ట్‌లో ఈ ఐపీఎల్ బుడ్డోడు అగ్రస్థానంలో నిలుస్తాడని మాజీలు అంచనాలు వేస్తున్నారు.

3 / 9
నికోలస్ పూరన్ (40 సిక్సర్లు): వైభవ్‌తో పాటు నికోలస్ పూరన్ కూడా ఏడవ స్థానంలో ఉన్నాడు. పూరన్ 2025 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 40 సిక్సర్లు కొట్టాడు. కాగా, నికోలస్ పూరన్ ఈ ఏడాది అంతగా రాణించలేకపోయాడు. లేదంటే అతని స్థానంలో భారీగా మార్పులు ఉండేవి.

4 / 9
అభిషేక్ శర్మ (42 సిక్సర్లు): టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. 2024లో అభిషేక్ 16 మ్యాచ్‌ల్లో 42 సిక్సర్లు బాదాడు. ఆ ఏడాది అతను 'సిక్సర్ కింగ్'గా నిలిచాడు. అభిషేక్ శర్మ ఫాం కూడా అంతగా లేదు. లేదంటో ఈ లిస్ట్‌లో మరింత ముందుకు వెళ్లేవాడు.

5 / 9
క్రిస్ గేల్ (44 సిక్సర్లు): యూనివర్సల్ బాస్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ ఐదవ స్థానంలో ఉన్నాడు. 2011లో ఆర్సీబీ తరపున ఆడుతూ 12 మ్యాచ్‌ల్లో 44 సిక్సర్లు కొట్టాడు. ఆ ఏడాది సిక్సర్ల వర్షంతో రెచ్చిపోయి, బౌలర్లకు పీడకలగా మారాడు.

6 / 9
జోస్ బట్లర్ (45 సిక్సర్లు): ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 2022లో రాజస్థాన్ రాయల్స్ తరపున 17 మ్యాచ్‌ల్లో 45 సిక్సర్లు బాదాడు. ఆ ఏడాది ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ అద్భుతమైన ఫాంలో నిలిచి బౌలర్లపై బీభత్సం సృష్టించాడు. దీంతో మొత్తంగా 4వ స్థానంలో నిలిచాడు.

7 / 9
క్రిస్ గేల్ (51 సిక్సర్లు): ఈ జాబితాలో గేల్ మూడో స్థానంలోనూ ఉన్నాడు. 2013లో అతను 16 మ్యాచ్‌ల్లో 51 సిక్సర్లు బాది ఆ సీజన్ టాప్ సిక్సర్ హిట్టర్‌గా నిలిచాడు. అద్భుతమైన ఫాంతో రెచ్చిపోయిన క్రిస్ గేల్ ఆ ఏడాది మరోసారి తన ప్రతాపం చూపించి, బౌలర్ల పాలిట విలన్‌గా మారాడు.

8 / 9
ఆండ్రీ రసెల్ (52 సిక్సర్లు): కోల్‌కతా స్టార్ ఆండ్రీ రసెల్ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో రసెల్ కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే 52 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వెస్టిండీస్ వీరుడు అద్భుతమైన ఫాంతో దూకుడుగా ఆడుతూ బౌలర్ల భరతం పట్టాడు.

9 / 9
క్రిస్ గేల్ (59 సిక్సర్లు): ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ పేరిట ఉంది. 2012లో గేల్ 14 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 59 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డు గత 14 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. మొత్తంగా ఈ లిస్ట్‌లో 3సార్లు తన పేరును లిఖించుకున్నాడు.

Follow Us