
Tabraiz Shamsi Unsold: టీ20 మాజీ నంబర్ వన్ బౌలర్ తబ్రేజ్ షమ్సీకి ఈసారి వేలంలో కొనుగోలుదారులు దొరకలేదు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు.

Aaron Finch Unsold: ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఈసారి కొనుగోలుదారు దొరకలేదు.

Chris Jordan: ఈసారి ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ జోర్డాన్‌పై ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. అతడిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రిటైన్ చేయలేదు.

Eoin Morgan: ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు. KKR మాజీ కెప్టెన్ కూడా అమ్ముడుపోలేకపోయాడు.

Dawid Malan: ఈసారి ఇంగ్లండ్ దూకుడు బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. గత సంవత్సరం అతను పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నాడు. కానీ ఇతను రెండవ లెగ్‌కు ముందు వైదొలిగాడు.

ishant Sharma: ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను వదిలించుకుంది. అయితే వేలంలో ఇషాంత్ కోసం ఎవరూ ముందుకు రాలేదు.

Marnus Labuschagne: ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లాబుస్‌చాగ్నే ఈసారి కూడా ఏ జట్టు తరఫున ఆడడం లేదు. గతేడాది కూడా వేలంలో అమ్ముడుపోలేదు.

Sheldon Cottrell Goes: వెస్టిండీస్‌కు చెందిన షెల్డన్ కాట్రెల్ గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. అయితే, ఈసారి ఇతను కూడా అమ్ముడుపోలేదు.