IPL 2026: ఇటు ధోనీకి ఇచ్చిపేడేసి.. అటు రోహిత్, కోహ్లీల సరసన చేరిన రూ. 75 లక్షల ప్లేయర్..!

Updated on: May 04, 2026 | 4:51 PM

Manish Pandey Record vs Dhoni: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పుంజుకుంది. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే, ఈ గెలుపు కంటే కూడా కేవలం రూ. 75 లక్షల కనీస ధరకు అమ్ముడైన మనీష్ పాండే సృష్టించిన చరిత్ర ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏకంగా దిగ్గజం ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టి రోహిత్, కోహ్లీ సరసన పాండే నిలిచాడు.

1 / 6
Manish Pandey Record vs Dhoni: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక పోరులో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన మనీష్ పాండే బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా, మైదానంలో అడుగుపెట్టడమే ఒక పెద్ద రికార్డుగా మారింది. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని 19 సీజన్లలోనూ భాగమైన అతి కొద్దిమంది ఆటగాళ్ల జాబితాలో మనీష్ పాండే చేరిపోయాడు.

2 / 6
క్రికెట్ ప్రపంచంలో ఎంఎస్ ధోనీకి సాధ్యం కాని రికార్డును మనీష్ పాండే ఈ మ్యాచ్ ద్వారా సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో (IPL 2026) ఇప్పటివరకు ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో, ఆయన 18 సీజన్లకే పరిమితమయ్యాడు. కానీ మనీష్ పాండే హైదరాబాద్‌పై మ్యాచ్‌తో తన 19వ సీజన్‌ను అధికారికంగా ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ: 19 సీజన్లు (ఆర్సీబీకే పరిమితం), రోహిత్ శర్మ: 19 సీజన్లు (వివిధ జట్లు), మనీష్ పాండే: 19 సీజన్లు (మొదటి మ్యాచ్‌తో రికార్డు పూర్తి).

3 / 6
మనీష్ పాండే ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. ఎందుకంటే ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్ ఆయనే. 2009లో ఆర్సీబీ తరఫున ఆడుతూ ఆయన ఈ ఘనత సాధించాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆరు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, కేకేఆర్‌తో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ సీజన్‌లో కేవలం రూ. 75 లక్షల బేస్ ప్రైస్‌కే కేకేఆర్ అతడిని కొనుగోలు చేయడం విశేషం.

4 / 6
ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ అలవోకగా ఛేదించింది. కెప్టెన్ అజింక్యా రహానే 43 పరుగులతో నిలకడగా ఆడితే, యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ మెరుపు దాడి చేశాడు. రఘువంశీ కేవలం 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిడిలార్డర్ బలంగా ఉండటంతో మనీష్ పాండేకు బ్యాటింగ్ చేసే అవసరమే రాలేదు.

5 / 6
వరుసగా మూడు విజయాలు సాధించినప్పటికీ కేకేఆర్ పరిస్థితి ఇంకా ఆశాజనకంగా లేదు. సీజన్ ఆరంభంలో వరుస ఓటములు జట్టును దెబ్బతీశాయి. ఇప్పుడు ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు వెళ్లడం కష్టం. అయినప్పటికీ, సీనియర్ ఆటగాడు మనీష్ పాండే వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉండటం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మెరుగుపరుస్తుందని యాజమాన్యం భావిస్తోంది.

6 / 6
వయస్సు పెరుగుతున్నా, ఐపీఎల్ వేలంలో పెద్దగా ధర పలకకపోయినా మనీష్ పాండే తన ఫిట్‌నెస్‌తో 19 సీజన్ల పాటు కొనసాగడం చిన్న విషయం కాదు. ధోనీ వంటి దిగ్గజాన్ని ఒక రికార్డులో అధిగమించడం పాండే పట్టుదలకు నిదర్శనం. రాబోయే మ్యాచ్‌ల్లో పాండే తన బ్యాట్‌తో కూడా మెరిస్తే కేకేఆర్ అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంది!

Follow Us