IPL 2025: 6వ స్థానంలో వచ్చాడు.. 13 బంతుల్లో 270కి పైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. అసలెవరీ అనికేత్?

Updated on: Mar 27, 2025 | 10:15 PM

Who is Aniket Verma: అనికేత్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్నది కొద్దిసేపైనా.. కేవలం సిక్సర్ల వర్షంతో ఉప్పల్ మైదానాన్ని గడగడలాడించాడు. మొత్తం ఐదు సిక్సర్లతో ఫోర్లు లేకుండానే లక్నోపై ఊచకోత కోశాడు. దీంతో ప్రస్తుతం ఈ ప్లేయర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

1 / 5
గురువారం హైదరాబాద్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త రిక్రూట్ అనికేత్ వర్మ 13 బంతుల్లో 36 పరుగులతో లక్నో బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నాడు.

2 / 5
అనికేత్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, తన కొద్దిసేపు ఇన్నింగ్స్‌లో ఫోర్లు లేకుండా కేవలం సిక్సర్లతోనే డీల్ చేశాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల బ్యాటర్‌ను హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐపీఎల్ వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.

3 / 5
2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అనికేత్ ఇప్పటివరకు తన సీనియర్ దేశీయ జట్టు తరపున ఒకే ఒక టీ20 ఆడాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ సమయంలో పేరుగాంచాడు. అక్కడ అతను ఐదు ఇన్నింగ్స్‌లలో 205 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 244 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

4 / 5
మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగల అనికేత్, పురుషుల వన్డే టోర్నమెంట్‌లో కర్ణాటక అండర్-23పై సెంచరీ సాధించాడు.

5 / 5
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున ట్రావిస్ హెడ్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. అనికేత్ వర్మ 5 సిక్సర్లు బాది 36 పరుగులు చేశాడు. నితీష్ రెడ్డి 32 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 26 పరుగులు చేశారు.