Ravi Kiran |
Oct 30, 2024 | 9:00 AM
ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఫ్రాంచైజీలు అక్టోబర్ 31లోపు తమ రిటైన్ ప్లేయర్స్ లిస్టును బీసీసీఐకి సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ తరుణంలో హేమాహేమీలు, టీ20 డైనమేట్‌లు వేలంలోకి రానున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఐపీఎల్ వేలానికి ముందుగానే ఆరు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లు వదులుకోవాలని భావిస్తున్నాయట. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ లిస్టులో పంజాబ్ కింగ్స్ - శిఖర్ ధావన్, ఆర్సీబీ - డుప్లెసిస్, ఢిల్లీ క్యాపిటల్స్ - రిషబ్ పంత్, కేకేఆర్ - శ్రేయాస్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ - కెఎల్ రాహుల్, గుజరాత్ టైటాన్స్ - శుభ్‌మాన్ గిల్ ఉన్నట్టు సమాచారం.
అలాగే ఈ ఆరుగురు కెప్టెన్లలో శిఖర్ ధావన్ మినహా మిగిలిన అందరూ కూడా మెగా వేలంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అటు వీరిలో కొందరు హై-అమౌంట్‌కి అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక పలు ఫ్రాంచైజీలలో పేరొందిన టీ20 డైనమేట్‌లు డికాక్, ఇషాన్ కిషన్, చాహల్, మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, వార్నర్, రబడా లాంటి అంతర్జాతీయ ప్లేయర్స్ ఉన్నారు.