కావ్యపాప.! ఆ ప్లేయర్‌ను ఎలిమినేట్ చేసేయ్.. హైదరాబాద్‌కు అతడే పెద్ద విలన్.. ఎవరంటే?

|

Apr 01, 2024 | 8:31 AM

మొన్న హోం గ్రౌండ్‌లో ముంబైపై అద్భుత విక్టరీ సాధించిన హైదరాబాద్.. ఇటీవల అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ జట్టులో ఓ ప్లేయర్ ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. కోట్లు పెట్టి కొన్నా.. పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడని వాపోతున్నారు.

1 / 6
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఉంది.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి. ఐపీఎల్ 2024లో ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడి.. కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచింది హైదరాబాద్. ఆరెంజ్ ఆర్మీలో విధ్వంసకర ప్లేయర్లు ఉన్నప్పటికీ.. సరైన ఫలితాలు మాత్రం రావట్లేదు.

2 / 6
మొన్న హోం గ్రౌండ్‌లో ముంబైపై అద్భుత విక్టరీ సాధించిన హైదరాబాద్.. ఇటీవల అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. ఇక గుజరాత్ ఈ టార్గెట్‌ను మరో 5 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.

3 / 6
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ జట్టులో ఓ ప్లేయర్ ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. కోట్లు పెట్టి కొన్నా.. పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడని వాపోతున్నారు. ఇంతకీ అతడెవరో కాదు మయాంక్ అగర్వాల్.

4 / 6
ఐపీఎల్ 2024లో SRH బ్యాటర్ మయాంక్ అగర్వాల్ దారుణ ఆటతీరు కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 59 పరుగులు మాత్రమే చేశాడు. ఇక గుజరాత్ మ్యాచ్‌లో అయితే.. 17 బంతుల్లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు.

5 / 6
ట్రావిస్ హెడ్ గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించినా.. ఈ మ్యాచ్ మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయాడు. ఇక అటు మరో ఓపెనర్‌గా దిగిన మయాంక్ అగర్వాల్ ఎప్పటిలానే జిడ్డు ఆటతో.. మిగతా హైదరాబాద్ ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

6 / 6
దీంతో ఫ్యాన్స్‌కి మయాంక్ ఆటతీరు చూసి నిరుత్సాహపడుతున్నారు. చేసేవే తక్కువ పరుగులు.. అవి కూడా ముక్కుతూ.. మూలుగుతూ చేస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కావ్య పాప.! అతడ్ని తీసేయండి జట్టు నుంచి అంటూ గట్టిగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మయాంక్ అగర్వాల్‌కి రూ. 8.25 కోట్లు చెల్లిస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్.