MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మహి ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఎంఎస్ ధోని తన కెప్టెన్సీలో IPL 2023 టైటిల్‌ను గెలుచుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ని నడిపించాడు. ఇప్పుడు మహీ మరోసారి ఐపీఎల్‌కు రెడీ అవుతున్నాడు.
చెన్నై రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాలో ధోనీ పేరు చేర్చారు. అంటే అతను తదుపరి ఐపీఎల్ అంటే 2024 ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ధోనీ కూడా టోర్నీకి సన్నాహాలు ప్రారంభించాడు. ఈ మేరకు మహి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో అతను జిమ్‌లో కనిపించాడు. జిమ్‌లో నల్లటి టీ షర్ట్‌లో మహి కనిపించాడు.
ఒక చిత్రంలో, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ నవ్వుతున్న ఫొటో కనిపిస్తుంది. ఇదే క్రమంలో మహి తిరిగి వస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2023 IPLలో, మహి అద్భుతాలు చేశాడు. చివరికి జట్టు కోసం కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇది అభిమానులకు చాలా వినోదాన్ని ఇచ్చింది.
గత సీజన్‌లో (IPL 2023), ధోని 16 మ్యాచ్‌లలో 11 ఇన్నింగ్స్‌లలో 34.67 సగటు, 185.71 స్ట్రైక్ రేట్‌తో 104 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 10 'మహీ స్టైల్' సిక్సర్లు కనిపించాయి.