Shikhar Dhawan: కింగ్ కోహ్లీని దాటేసిన గబ్బర్.. ఐపీఎల్ చరిత్రలో రెండో ప్లేయర్‌గా సరికొత్త రికార్డు..

|

Apr 10, 2023 | 6:25 AM

హైదరాబాద్‌పై అజేయంగా 99 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. అసలు ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 7
IPL 2023: క్రికెట్ మైదానంలో ఒంటరి పోరాటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే..  IPL 2023 టోర్నీ 14వ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రదర్శన తప్పక చూడాలి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై  సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2 / 7
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ తరఫున.. కెప్టెన్ ధావన్ అజేయంగా 99 పరుగులతో వన్ మ్యాచ్ షో చేశాడు. ఇక టీమ్ ఓపెనర్‌గా వచ్చిన ధావన్‌కి సామ్ కర్రన్(22) మినహా మిగిలినవారి నుంచి సహాయం అందలేదు. దీంతో పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేసింది.

3 / 7
అనంతరం క్రీజులోకి దిగిన హైదరాబాద్ టీమ్ ఆటగాళ్లు సునాయాసంగా తమ ఎదుట ఉన్న లక్ష్యాన్ని చేదించి విజయం కైవసం చేసుకున్నారు. ఫలితంగా గబ్బర్ చేసిన వన్ మ్యాచ్ షో వృధాగా మిగిలిపోయింది.

4 / 7
ఈ అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో శిఖర్ ధావన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టాడు. అవును, ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 50+ పరుగులు చేసిన వారి జాబితాలో శిఖర్ ధావన్ 2వ స్థానానికి చేరుకున్నాడు.

5 / 7
అయితే అంతకముందు ఈ జాబితా రెండో స్థానంలో కింగ్ కోహ్లీ ఉన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లోనే ముంబైపై అజేయంగా 82 పరుగులు చేసిన కోహ్లీ.. ఈ టోర్నీ చరిత్రలో 50వ సారి 50+ పరుగులు చేశాడు. తద్వారా  ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 50+ పరుగులు చేసిన ఆటగాడిగా 2వ స్థానంలో నిలిచాడు.

6 / 7
కానీ ఇప్పుడు హైదరాబాద్ టీమ్‌పై శిఖర్ ధావన్ చేసిన అజేయమైన 99 పరుగుల ఇన్నింగ్స్‌తో కింగ్ కోహ్లీని అధిగమించాడు. శిఖర్ ధావన్ 208 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 51 సార్లు 50+ పరుగులను చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 49 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. తద్వారా ఆ లిస్టులో కోహ్లీని కిందకు నెట్టి రెండోస్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు.

7 / 7
ఇక ఈ రికార్డు జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 165 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్ ఏకంగా  61 సార్లు 50+ పరుగుల మార్క్ అందుకున్నాడు.