IPL 2023 CSK vs GT: ఐపీఎల్‌లో ధోనిపై అతని శిష్యుడిదే పైచేయి.. గుజరాత్, చెన్నై జట్ల రికార్ఢులు ఎలా ఉన్నాయంటే..?

|

Mar 30, 2023 | 7:26 AM

IPL 2023 CSK vs GT: రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గతేడాది టోర్నీ విజేతలుగా నిలిచిన గుజరాత్, 4 సార్లు ఐపీఎల్ కప్ అందుకున్న చెన్నై జట్ల మధ్య ఐపీఎల్ హిస్టరీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

1 / 7
IPL 2023 CSK vs GT: ఎంతో మంది క్రికెటర్లకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోని ఒక రోల్ మోడల్, గురువు. ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. చెన్నై టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తన రోల్ మోడల్‌గా భావిస్తాడు. అయితే ఐపీఎల్‌ రికార్డుల ప్రకారం ధోనీ జట్టుపై హర్దిక్ సేన పైచేయి సాధించినట్లుగా ఉంది.

2 / 7
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, అతని శిష్యుడు హార్దిక్ పాండ్యా ముఖాముఖి తలపడనున్నారు. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి అయినప్పటికీ, గతేడాదే కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ చెన్నై జట్టును కప్పివేసిన్నట్లు కనిపిస్తోంది.

3 / 7
లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 10 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత  క్వాలిఫయర్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి, ఆపై ఫైనల్‌లో టైటిల్ గెలుచుకుంది. మరోవైపు చెన్నై జట్టు ప్రదర్శన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఆ జట్టు ఐపీఎల్ 15వ సీజన్‌లో 14 మ్యాచ్‌లకు 4 మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది.

4 / 7
గత సీజన్ రౌండ్‌లో ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్‌లు జరిగాయి. అది గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్. అయితే ఆ రెండు సార్లు కూడా హార్దిక్ కెప్టెన్సీ చెన్నైని ఓడించింది. చెన్నైపై గుజరాత్ రికార్డు 100 శాతం.

5 / 7
అవును, గుజరాత్‌తో చెన్నై రెండు మ్యాచ్‌లు ఆడింది. వాటిలో ఒకటి రవీంద్ర జడేజా కెప్టెన్‌గా ఉండగా, మరొకటి మహేంద్ర సింగ్ ధోనీ జట్టు సారథిగా వ్యవహరించాడు. జడేజా సారథ్యంలోని ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 169 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ చివరి ఓవర్ ఐదో బంతికి సాధించింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ 94 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.

6 / 7
IPL 2023 CSK vs GT: ఐపీఎల్‌లో ధోనిపై అతని శిష్యుడిదే పైచేయి.. గుజరాత్, చెన్నై జట్ల రికార్ఢులు ఎలా ఉన్నాయంటే..?

7 / 7
ఇలా ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ధోని జట్టుపై హర్దిక్‌ సేనదే పైచేయి. మరి ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023 మొదటి మ్యాచ్‌లో తలపడనున్న చెన్నై, గుజరాత్. మరి రేపు జరగబోయే ఈ మ్యాచ్‌లో చెన్నై గెలుస్తుందా లేదా మరోసారి గుజరాత్ పైచేయి సాధింస్తుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.