
ఏప్రిల్ 21, గురువారం, చెన్నైపై మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి మంచి ఆరంభం దక్కలేదు. మొదటి ఓవర్‌లోనే జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఇన్నింగ్స్ రెండో బంతికి రోహిత్ శర్మ సింపుల్ క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు.

ఈ సీజన్‌లో రోహిత్‌కి ఇంతవరకు పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ముంబై కెప్టెన్ 7 ఇన్నింగ్స్‌ల్లో 114 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అతని అత్యధిక స్కోరు 41 పరుగులు.

IPL 2022 ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ.. చెన్నై మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 2 బంతుల్లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ఐపీఎల్ చెత్త రికార్డు కూడా రోహిత్ పేరిట నమోదైంది.

దీంతో రోహిత్ శర్మ పేరిట ఓ షాకింగ్ రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో ఖాతా తెరవకుండానే అత్యధిక సార్లు అవుట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్‌లో రోహిత్ బ్యాటింగ్‌లో ఒక్క పరుగు కూడా రాకపోవడం ఇది 14వ సారి. అంతకుముందు పీయూష్ చావ్లా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్ వంటి బ్యాట్స్‌మెన్‌లతో సమానంగా 13 వద్ద ఉన్నాడు.