కోల్‌కతా నైట్ రైడర్స్ సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్ వంటి స్టార్‌లతో నిండిన ఆర్‌సీబీ టీం కేకేఆర్ డెబ్యూ ఆటగాళ్ల ముందు ఓడిపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జట్టు 92 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ తప్ప, ఎవరూ 20 పరుగుల మార్కును తాకలేకపోయారు. మరోవైపు కేకేఆర్ జట్టు కేవలం 10 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది.
కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆర్‌సీబీని తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్రం పోషించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు ఓవర్లలో 13 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ ఆర్కిటెక్ట్ చదువుకున్నాడు.
సోమవారం హీరోగా మారిన కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్.. తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. కేవలం 27 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.
వెంకటేశ్ అయ్యర్ చదువులో అగ్రస్థానంలో రాణిస్తున్నాడు. సీఏ పరీక్షలో వెంకటేష్ టాపర్‌గా ఉన్నాడు. అయితే, క్రికెట్ కోసం సీఏను మధ్యలోనే వదిలేశాడు. క్రికెట్ ఆడటం మొదలుపెట్టి ఉండకపోతే ఈరోజు ఐఐఎంలో ఉండేవాడు.