IPL 2021: రాహుల్ రికార్డులపై కన్నేసిన చెన్నై ఓపెనర్.. నేడు ఢిల్లీతో మ్యాచులో సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడా?

|

Oct 04, 2021 | 8:04 AM

రుతురాజ్ ఉన్న ఫామ్ పరంగా ధోనిసేన విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మరో 2 రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు.

1 / 5
రుతురాజ్ గైక్వాడ్ ఎల్లో ఆర్మీలో కీలకమైన ప్లేయర్‌లా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించి, జట్టును ప్లే ఆఫ్‌లో చేర్చాడు. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో రితురాజ్ గైక్వాడ్ ఏకకాలంలో 2 రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈరోజు రుతురాజ్ బ్రేక్ చేయగల ఈ రెండు రికార్డులు ఒకే బ్యాట్స్‌మెన్‌కు చెందినవి కావడం. ఆయనెవరో కాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌.

2 / 5
ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఆ 2 రికార్డులతో సత్తా చాటాడు. ఈ రెండు రికార్డులు ఏంటంటే.. ఐపీఎల్ 2021 లో అత్యధిక సిక్సర్లు, అత్యధిక పరుగులు. ఐపీఎల్ 2021లో అత్యధికంగా 22 సిక్సర్లు, అత్యధికంగా 528 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఈ రెండింటిని రాహుల్ ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో సాధించడం గమనార్హం.

3 / 5
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2021 లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రితురాజ్ గైక్వాడ్ నిలిచాడు. అతను ఇప్పటివరకు 20 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో 508 పరుగులు కూడా చేశాడు. అంటే, ఈ రోజు రుతురాజ్ తన ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 21 పరుగులు చేస్తే కేఎల్ రాహుల్‌ సాధించిన రెండు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈరోజు ఐపీఎల్ 2021 లో రుతురాజ్ తన 13 వ మ్యాచ్ ఆడనున్నాడు.

4 / 5
అయితే కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. కానీ, పంజాబ్ కింగ్స్‌కు ఇంకా 2 మ్యాచ్‌లు గ్రూప్‌స్టేజ్‌లో మిగిలి ఉన్నాయి. అంటే నేడు రుతురాజ్ రికార్డును బద్దలు కొడితే, మిగిలిన 2 మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ మరలా రుతురాజ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. అయితే, ప్లే ఆఫ్ తరువాత రుతురాజ్ ఇంకొన్ని మ్యాచులు ఆడనుండడంతో.. ఆయనే ఈ రికార్డుల్లో విజేతగా నిలచే అవకాశం ఉంది.

5 / 5
ఐపీఎల్ 2021 లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఈ సీజన్‌లో 100 సిక్సర్‌లకు కేవలం 4 అడుగుల దూరంలో నిలిచింది. అంటే ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ టీం 96 సిక్సర్లు బాదేసింది. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే 20 సిక్సర్లు సాధించాడు. ఫాఫ్ డు ప్లెసిస్ 18 సిక్సర్లతో జట్టులో రెండో స్థానంలో ఉన్నాడు.