
ప్లేయర్ గా, వైస్ కెప్టెన్ గా భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించింది స్మృతి మంధాన. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్రాంఛైజీకి తొలి టైటిల్ అందించిన కెప్టెన్‌గా ఘనత అందుకుంది.

ఐపీఎల్ కానీ , డబ్ల్యూపీఎల్ లో కానీ రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ జట్టుకు దక్కిన ఏకైక టైటిల్ స్మృత కెప్టెన్సీలోనే రావడం గమనార్హం.

ప్రస్తుతం భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతోన్న స్మృతి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు ఇన్ స్టాలోనే 12 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

అలా తాజాగా స్మృతి షేర్ చేసిన ఒక పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె మట్టికుండ తయారు చేసిన ఫొటోను స్మృతి ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసింది

దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'మేడమ్ లో ఈ స్పెషల్ ట్యాలెంట్ కూడా ఉందా?' అని అంటున్నారు.