IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్‌లలో టాప్-5 బ్యాట్స్‌మెన్ వీరే.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

|

Oct 06, 2022 | 12:04 PM

IND vs SA ODI Series: టీమిండియా ప్రధాన జట్టు టీ20 ప్రపంచ కప్ 2022 కోసం ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరింది. అయితే, మరో జట్లు సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ నేడు లక్నోలో జరగనుంది.

1 / 6
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముందు రెండు జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లలో ఏ బ్యాట్స్‌మెన్ ఎక్కువ పరుగులు చేశారో ఓసారి చూద్దాం.

2 / 6
భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. లిటిల్ మాస్టర్ ప్రొటీస్ జట్టుపై 2001 పరుగులు చేశాడు. సచిన్ దక్షిణాఫ్రికాతో 57 మ్యాచ్‌లలో 35.73 బ్యాటింగ్ సగటు, 76.31 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాపై 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది.

3 / 6
ఈ జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కల్లిస్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను భారత్‌పై 37 మ్యాచ్‌లలో 61.40 బ్యాటింగ్ సగటు, 72.37 స్ట్రైక్ రేట్‌తో 1535 పరుగులు చేశాడు. ఈ సమయంలో కలిస్ రెండు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు.

4 / 6
భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ 30 మ్యాచ్‌ల్లో 61 సగటుతో 85.91 స్ట్రైక్ రేట్‌తో 1403 పరుగులు చేశాడు. ప్రొటీస్‌పై విరాట్ కోహ్లీ 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించాడు.

5 / 6
దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిస్టెర్న్ నాలుగో స్థానంలో నిలిచాడు. అతను భారత్‌పై 26 మ్యాచ్‌లలో 62.59 సగటు, 76.62 స్ట్రైక్ రేట్‌తో 1377 పరుగులు చేశాడు. ఈ సమయంలో కిస్టర్న్ 4 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు చేశాడు.

6 / 6
ఈ టాప్-5 జాబితాలో ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నాడు. డివిలియర్స్ భారత్‌పై 32 మ్యాచ్‌లలో 48.46 సగటు, 111.13 స్ట్రైక్ రేట్‌తో 1357 పరుగులు చేశాడు. ఈ సమయంలో డివిలియర్స్ 6 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాధించాడు.