IND vs NZ: ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత.. ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కింగ్ కోహ్లీ.. అదేంటంటే?

|

Oct 19, 2024 | 7:03 AM

Virat Kohli: మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. మరో 125 పరుగులు వెనుకంజలో నిలిచింది. జైస్వాల్ 35 పరుగులు, రోహిత్ శర్మ 52, విరాట్ కోహ్లీ 70 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. సర్ఫరాజ్ 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

1 / 7
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న బెంగళూరు టెస్ట్ మ్యాచ్ మూడో రోజు రెండు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402 పరుగుల వద్ద ముగిసింది. అందుకు ప్రతిగా టీమ్ ఇండియా కూడా ఫైట్ చేస్తోంది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది.

2 / 7
కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ కూడా 50+ పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడారు. అలాగే వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లి 70 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, సర్ఫరాజ్ ఖాన్ 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

3 / 7
ఆట ముగిసే సమయానికి తడబడిన కోహ్లీ పెవిలియన్ చేరాడు. బెంగళూరులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 102 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 70 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా కోహ్లీ రెండు కీలక రికార్డులు సృష్టించాడు.

4 / 7
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటైన విరాట్ కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో అంతర్జాతీయ కెరీర్‌లో 221వ సారి 50+ పరుగులు సాధించాడు. అదే సమయంలో, అతను టెస్ట్ క్రికెట్‌లో 9000 పరుగులు కూడా పూర్తి చేశాడు.

5 / 7
దీంతో భారత్ తరపున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే, ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి 15000 పరుగుల రికార్డును కూడా సాధించాడు.

6 / 7
కోహ్లీ తన 316 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా, విరాట్ తర్వాత ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ రెండో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి 14555 పరుగులు చేశాడు. ఇప్పుడు ద్రవిడ్‌ను విరాట్ కోహ్లీ అధిగమించాడు.

7 / 7
అంతేకాదు, విరాట్ కోహ్లీ ఒక టెస్టులో మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేసి 50 పరుగుల మార్క్‌ను చేరుకోవడం ఇదే తొలిసారి. టెస్టుల్లో 9000 పరుగులు, వన్డేల్లో 10000 పరుగులు, టీ20ల్లో 4000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ తన పేరిట మరో ప్రత్యేక రికార్డు సృష్టించాడు.