IND vs SL, Asia Cup 2023 Final: ఫైనల్ మ్యాచ్‌లో రికార్డుల వర్షం.. లిస్టులో ఇరుజట్ల ఆటగాళ్లు..

|

Sep 17, 2023 | 1:31 PM

Asia Cup 2023 Final: ఆదివారం జరగనున్న ఆసియా కప్ 2023 ఫైనల్‌కు కొలంబో సిద్ధమైంది. టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక నేడు ప్రేమదాస స్టేడియంలో ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఎన్నో రికార్డులను లిఖించే దిశగా దూసుకుపోతున్నారు. ఈ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

1 / 8
ఆదివారం జరగనున్న ఆసియా కప్ 2023 ఫైనల్‌కు కొలంబో సిద్ధమైంది. టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక నేడు ప్రేమదాస స్టేడియంలో ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఎన్నో రికార్డులను లిఖించే దిశగా దూసుకుపోతున్నారు.

2 / 8
కేఎల్ రాహుల్: టీమిండియా కీలక ప్లేయర్ కేఎల్ రాహుల్ వన్డే ఫార్మాట్‌లో తన హాఫ్ సెంచరీ సిక్సర్లు పూర్తి చేయడానికి మరో 2 సిక్సర్లు కొట్టాల్సి ఉంటుంది. నేటి మ్యాచ్‌లో ఈ రికార్డును చేరుకునే అవకాశం ఉంది.

3 / 8
రోహిత్ శర్మ: అంతర్జాతీయ క్రికెట్‌లో 550 సిక్సర్ల రికార్డును పూర్తి చేయడానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మకు 5 సిక్సర్లు అవసరం. అలాగే, ఆసియాకప్‌లో వన్డే ఫార్మాట్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి రోహిత్‌కి ఇంకా 61 పరుగులు అవసరం.

4 / 8
మహ్మద్ సిరాజ్: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో అర్ధ సెంచరీ పూర్తి చేయడానికి 3 వికెట్లు కావాల్సి ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొడితే అద్భుతమైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకునే ఛాన్స్ ఉంది.

5 / 8
హార్దిక్ పాండ్యా: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో 300 బౌండరీల రికార్డును పూర్తి చేయడానికి 4 బౌండరీల దూరంలో ఉన్నాడు.

6 / 8
దసున్ షనక: వన్డే ఫార్మాట్‌లో బౌండరీల సెంచరీ పూర్తి చేసేందుకు శ్రీలంక కెప్టెన్ దసున్ షనకకు 3 బౌండరీలు అవసరం. గత మ్యాచ్‌లో కీలక సమయంలో విఫలమైన షనక, ఫైనల్ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

7 / 8
కుసాల్ మెండిస్: అంతర్జాతీయ క్రికెట్‌లో 150 సిక్సర్ల రికార్డును పూర్తి చేయడానికి కుశాల్ మెండిస్ 3 సిక్సర్లు కావాలి. వన్డేల్లో సిక్సర్ల హాఫ్ సెంచరీని చేరుకోవడానికి కుసాల్‌కు మరో 4 సిక్సర్లు అవసరం. అలాగే, వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుశాల్‌కు 93 పరుగులు అవసరం.

8 / 8
కసున్ రజిత: అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు సాధించిన రికార్డును పూర్తి చేయడానికి కసున్ రజిత 3 వికెట్ల దూరంలో ఉన్నాడు.