
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్‌తో నిరంతరం పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో ప్రారంభంలోనే అవుట్ అయిన తర్వాత, టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో రోహిత్ బలమైన పునరాగమనం చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు గొప్ప ప్రారంభాన్ని అందించాడు. దీంతో పాటు రోహిత్ తన పేరిట ఓ రికార్డు కూడా సృష్టించాడు.

కోల్‌కతాలోని తనకు ఇష్టమైన ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆడుతున్న రోహిత్ శర్మ.. వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యానికి సమాధానంగా, రోహిత్, ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి జట్టును కేవలం 5 ఓవర్లలో 50 పరుగులు దాటించాడు.

ఈ సమయంలో, ఓడిన్ స్మిత్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ కూడా 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదాడు. 8వ ఓవర్‌లో ఔటైన రోహిత్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ భారత్‌కు మంచి శుభారంభం అందించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో, రోహిత్ తన పేరిట ఒక రికార్డును కూడా సృష్టించాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌పై టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ 16 ఇన్నింగ్స్‌ల్లో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో సహా 559 పరుగులు చేశాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 540 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను రోహిత్ అధిగమించాడు.