IND vs SA: భారత్-సౌతాఫ్రికా పోరులో బద్దలైన రికార్డులు ఇవే.. ప్రపంచంలోనే తొలి జట్టుగా రోహిత్ సేన..

|

Nov 06, 2023 | 2:39 PM

IND vs SA, ICC World Cup 2023: క్రికెట్ కాశీగా పేరుగాంచిన ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ అనేక మైలురాళ్లను సాధించింది. సచిన్ టెండూల్కర్ చరిత్రాత్మక రికార్డును రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేసి, తన ఖాతాలో మరో చిరస్మరణీమయైన విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 243 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.

1 / 7
ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ ఎన్నో మైలురాళ్లకు సాక్షిగా నిలిచింది. సౌతాఫ్రికాపై సెంచరీ చేయడంతో సచిన్ టెండూల్కర్ చరిత్రాత్మక రికార్డును కూడా విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు సృష్టించారు.

2 / 7
సౌతాఫ్రికాపై విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసింది. సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు చేయగా, కోహ్లి కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

3 / 7
భారత్‌పై కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత, దక్షిణాఫ్రికా ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌పై అతి తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన అవాంఛిత రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది 4 వన్డేల్లో ప్రత్యర్థి జట్టును భారత్ 100 కంటే తక్కువ పరుగులకే కట్టడి చేసింది. పురుషుల క్రికెట్‌లో ఇదో రికార్డుగా మారింది.

4 / 7
చివరి రెండు వన్డేల్లో భారత్ 138 పరుగులకే ప్రత్యర్థులను కట్టడి చేసింది. శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాను 83 పరుగులకే పరిమితం చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నమోదైన అత్యల్ప పరుగులు ఇవే. వెస్టిండీస్ చాలా కాలం పాటు ఈ రికార్డును కలిగి ఉంది. 1992-93లో వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లలో పాకిస్థాన్‌ను 152 పరుగులకే  (81, 71) కట్టడి చేసింది.

5 / 7
భారత్‌పై దక్షిణాఫ్రికా 243 పరుగుల తేడాతో ఓడిపోయింది. పురుషుల వన్డే క్రికెట్‌లో పరుగుల పరంగా దక్షిణాఫ్రికాకు ఇదే అతిపెద్ద ఓటమిగా నిలిచింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ ఐదు మ్యాచ్‌ల్లో 200 కంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయం సాధించింది. పురుషుల క్రికెట్‌లో ఏ జట్టు కూడా ఏడాదిలో మూడు సార్లు కంటే ఎక్కువ 200 పరుగులతో గెలవలేదు. అయితే ఇప్పుడు భారత్ ఆ ఘనత సాధించింది.

6 / 7
రవీంద్ర జడేజా ఆఫ్రికాపై 5 వికెట్లు పడగొట్టి, వన్డే ప్రపంచకప్‌లో 5 వికెట్లు తీసిన రెండో భారత స్పిన్నర్‌గా నిలిచాడు. జడేజా కంటే ముందు యువరాజ్ సింగ్ 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై 31 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.

7 / 7
వన్డే ప్రపంచకప్‌లో పుట్టిన రోజున సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కోహ్లి కంటే ముందు, న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ తన 27వ పుట్టినరోజున 2011 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై అజేయంగా 131 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ గత నెలలో తన 32వ పుట్టినరోజున ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ సాధించాడు.