WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి రోహిత్ సేన ఔట్.. పూణె ఓటమితో లెక్కలు మార్చనున్న సౌతాఫ్రికా?

|

Oct 26, 2024 | 12:51 PM

Team India: పూణెలో టీమిండియాకు అంతా బ్యాడ్ టైం నడుస్తోంది. ఇప్పటికే బెంగళూరులో ఓటిమితో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోన్న రోహిత్ సేన.. రెండో టెస్ట్‌లోనే అదే దారిలో పయణిస్తోంది. ఈ క్రమంలో ఇన్నాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఫేవరేట్ అనుకున్న టీం.. ఒక్కసారిగా తలకిందులయ్యే పరిస్థితి ఎదురైంది.

1 / 5
బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా భారత్ తన హోమ్ టెస్ట్ సీజన్‌ను అద్బుతంగా ప్రారంభించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే, న్యూజిలాండ్ సిరీస్‌లో కూడా టీమ్ ఇండియా మెరుగ్గా రాణించాల్సి ఉంది. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. బెంగళూరులో భారత్‌ను ఓడించి న్యూజిలాండ్‌ అందిరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు టీం ఇండియా పుణెలో కూడా ఓటమి ప్రమాదంలో పడింది.

2 / 5
భారత జట్టు రెండో మ్యాచ్‌లో ఓడిపోతే 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది. ఇది కాకుండా, WTC ఫైనల్ మార్గం కూడా చాలా కష్టంగా మారుతుంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భారత్ ప్రయత్నించాల్సి ఉంటుంది.

3 / 5
రెండో టెస్టులో రెండో రోజు మొత్తం 14 వికెట్లు పడ్డాయి. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యేకంగా ఏమీ చూపించలేక న్యూజిలాండ్ బౌలర్ల ముందు  156 పరుగులకే పరిమితమైంది. దీంతో విజిటింగ్‌ టీమ్‌కి 103 పరుగుల గణనీయమైన ఆధిక్యం లభించింది.

4 / 5
తన రెండో ఇన్నింగ్స్‌లో కూడా, న్యూజిలాండ్ 255 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 359 పరుగుల టార్గెట్ అందించింది. స్పిన్ బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. భారత్ ఓటమి ప్రమాదంలో పడటానికి ఇదే కారణం.

5 / 5
ప్రస్తుతం, భారత్ 8 మ్యాచ్‌లలో 12 విజయాలతో WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాయింట్ల శాతం 68.06గా ఉంది. పుణెలో భారత్ ఓటమిని ఎదుర్కొంటే, దాని పాయింట్ల శాతం దాదాపు 62 ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మిగిలిన 6 టెస్ట్‌లలో కనీసం 4 మ్యాచ్‌లను గెలవవలసి ఉంటుంది. అప్పుడే భారత ఏ ఇతర జట్టుపై ఆధారపడకుండా WTC ఫైనల్‌కు చేరుకోగలదు. ఇది జరగకపోతే భారత్ ఇతర జట్లపై ఆధారపడక తప్పదు. అలాగే దక్షిణాఫ్రికా తన మిగిలిన అన్ని టెస్టుల్లోనూ విజయం సాధించకూడదని ఎదురుచూడాల్సి ఉంటుంది.