Jasprit Bumrah: హార్దిక్ రికార్డ్‌ని ‘బౌల్డ్’ చేసిన బూమ్రా.. కట్ చేస్తే, టాప్ 3 లిస్టులో చోటు..

|

Aug 22, 2023 | 8:23 AM

IND vs IRE: భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్ ఇప్పటికే టీమిండియా సొంతమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఐర్లాండ్‌పై గెలిచిన బూమ్రా సేన మరో టీ20 మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌లో ఆధిక్యత సాధించింది. అలాగే ఐర్లాండ్‌పై జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ రెండేసి వికెట్లు పడగొట్టిన బూమ్రా.. హార్దిక్ పాండ్యా పేరిట ఉన్న ఓ రికార్డ్‌ను బౌల్డ్ చేశాడు. అలాగే భారత్ తరఫున అందుకు సంబంధించిన లిస్టులో టాప్ 3 స్థానానికి చేరుకున్నాడు. ఇంతకీ బూమ్రా ఏం చేశాడంటే..?

1 / 5
IND vs IRE: ఐర్లాండ్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన జస్ప్రీత్ బూమ్రా.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ టీ20 మ్యాచ్‌కి ముందు ఆ స్థానంలో హార్దిక్ పాండ్యా ఉండేవాడు.

2 / 5
70 టీ20 వికెట్లు తీసిన బూమ్రా దాదాపు 327 రోజుల పాటు గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ సమయంలోనే వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హార్దిక్.. బూమ్రాను అధిగమించి మొత్తం 73 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా అవతరించాడు.

3 / 5
అయితే గాయం నుంచి తిరిగొచ్చిన బూమ్రా.. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ 2, 2 వికెట్లు తీశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 74 వికెట్లు తీసిన బూమ్రా.. హార్దిక్‌ని అధిగమించాడు. ఇంకా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో భారతీయుడిగా నిలిచాడు. మరోవైపు హార్దిక్ నాలుగో స్థానానికి దిగిపోయాడు.

4 / 5
కాగా, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చాహల్ ఇప్పటివరకు 96 వికెట్లు పడగొట్టి ఈ రికార్డ్ సృష్టించాడు.

5 / 5
అలాగే చాహల్ తర్వాత భువనేశ్వర్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. భువీ మొత్తంగా 90 టీ20 వికెట్లు తీశాడు.