
శనివారం విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ టెస్టుల్లో డబుల్ సెంచరీ (209) నమోదు చేసిన మూడో అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నిలిచాడు.

22 ఏళ్ల 37 రోజుల వయసులో జైస్వాల్ ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్ తర్వాత నిలిచాడు. కాంబ్లీ 21 ఏళ్ల 35 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌పై 224 పరుగులతో కాంబ్లీ రెచ్చిపోయాడు.

రెండో స్థానంలో టీమిండియా దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ 21 ఏళ్ల 277 రోజుల వయసులో వెస్టిండీస్‌పై 220 పరుగులతో ఆకట్టుకున్నాడు.

కాగా, 23 ఏళ్ల 34 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని యశస్వి జైస్వాల్ అధిగమించాడు.

179 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన జైస్వాల్ స్కోరు 200 దాటడానికి కేవలం ఎనిమిది ఓవర్లు మాత్రమే అవసరమయ్యాయి.

షోయబ్ బషీర్‌ను ఒక సిక్స్, ఒక ఫోర్‌తో జైస్వాల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. అనంతరం 209 పరుగుల వద్ద అండర్ సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.