
అడిలైడ్ మైదానంతో విరాట్ కోహ్లీకి విడదీయలేని సంబంధం ఉంది. ఇప్పటికే ఇక్కడ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలతో సత్తా చాటిన ఈ మాజీ సారథి.. నేడు బంగ్లాతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో క్రీజులో ఆధిపత్యం చెలాయిస్తూ.. పరుగుల వర్షం కురిపిస్తున్నాడు.

ఇక్కడ ఇన్నింగ్స్‌లో 16వ పరుగు చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 23 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌పై ఈ ఇన్నింగ్స్‌తో అగ్రస్థానానికి చేరాడు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనే రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. జయవర్ధనే 2007, 2014 మధ్య ఆడిన T20 ప్రపంచకప్‌లో 31 మ్యాచ్‌లలో 31 ఇన్నింగ్స్‌లలో 1016 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతడిని విరాట్ కోహ్లీ అధిగమించాడు.

విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా టీ20 ప్రపంచకప్‌లో 1000 పరుగులకు చేరువలో ఉన్నాడు. అతను 37 మ్యాచ్‌లలో 34 ఇన్నింగ్స్‌లలో 900 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లి, మహేల జయవర్ధనే, రోహిత్ శర్మలతో పాటు టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు క్రిస్ గేల్.