Rohit Sharma Records: గాయం ఇబ్బంది పెట్టినా.. తుఫాను బ్యాటింగ్‌తో స్పెషల్ రికార్డ్.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్..

|

Dec 08, 2022 | 5:30 AM

Rohit Sharma: రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 502 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా భారత కెప్టెన్ నిలిచాడు.

1 / 7
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా కెప్టెన్ 28 బంతుల్లో అజేయంగా 51 పరుగులతో నిలిచాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు.

2 / 7
అయితే భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ, ఈ మ్యాచ్‌లో కడవరకు పోరాడిన రోహిత్ శర్మ.. తన పేరిట ఓ భారీ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత కెప్టెన్ 500 సిక్సర్లు పూర్తి చేశాడు.

3 / 7
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 502 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడు రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 428 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 502 సిక్సర్లు బాదాడు.

4 / 7
భారత కెప్టెన్ కంటే క్రిస్ గేల్ ముందున్నాడు. వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ 483 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 553 సిక్సర్లు కొట్టాడు. ఈ విధంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు.

5 / 7
ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మూడో స్థానంలో నిలిచాడు. షాహిద్ అఫ్రిది 508 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లు కొట్టాడు.

6 / 7
అలాగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఉన్నాడు. బ్రెండన్ మెకల్లమ్ 474 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 398 సిక్సర్లు కొట్టాడు.

7 / 7
ఇక న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 402 మ్యాచ్‌ల్లో 383 సిక్సర్లతో ఐదో స్థానంలో నిలిచాడు.