టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆసీస్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఆసీస్‌పై భారత్ గెలవడం 50 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.
కాగా భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం పట్ల ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ చేసిన ఒక పనికి క్రికెట్ ప్రపంచం మొత్తం సెల్యూట్ చేస్తోంది
టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి, హర్మన్‌ప్రీత్ కౌర్ స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టును ఓడించి ట్రోఫీని ఎత్తి సంబరాలు చేసుకుంది. ఈ సమయంలో ఆసీస్ కెప్టెన్ అలిస్సా హీలీ ఫొటో గ్రాపర్‌గా మారిపోయింది. తన పర్సనల్ కెమెరాను తీసుకుని టీమ్ ఇండియా ఫొటోలు తీసింది.
భారత జట్టు విన్నింగ్ మూమెంట్స్‌ను తన మెరాలో బంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ అలిస్సా హీలీ క్రీడా స్పూర్తికి క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఆసీస్ కెప్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్ స్నేహ రానా అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. స్నేహ రాణా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. మొత్తం మీద రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 7 వికెట్లు తీసిన స్నేహ రానా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది.