Ranji Trophy 2024: పేలవ ఫాంతో టీమిండియా నుంచి ఔట్.. కట్‌చేస్తే.. రంజీలో వరుసగా 2వ సెంచరీ బాదిన హైదరాబాదీ..

|

Jan 20, 2024 | 4:28 PM

Ranji Trophy 2024: సిక్కింతో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తరుపున 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ 111 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పేలవ ఫాంతో టీమిండియా నుంచి ఔటైన ఈ హైదరాబాదీ వరుసగా రెండు సెంచరీలతో మరలా ఫాంలోకి వచ్చాడు.

1 / 7
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ఈ ఎడిషన్‌లో వరుసగా రెండో సెంచరీని సాధించాడు.

2 / 7
ఈ ఏడాది రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌ జట్టు సిక్కింతో మూడో మ్యాచ్‌ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో సిక్కిం జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు 463 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

3 / 7
సిక్కింతో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తరుపున 4వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ 111 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

4 / 7
అతనితో పాటు, తన్మయ్ అగర్వాల్ కూడా హైదరాబాద్ తరపున 137 పరుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ సింగ్ 83 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా సిక్కింపై తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ ఆధిక్యాన్ని కొనసాగించింది.

5 / 7
రంజీలో తిలక్ వర్మ ప్రదర్శన గురించి మాట్లాడితే, ఈ సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో అంటే నాగాలాండ్‌పై తిలక్ 100 పరుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు భారత జట్టులో భాగంగా తిలక్ రెండో రంజీ మ్యాచ్ ఆడలేకపోయాడు.

6 / 7
ప్రస్తుతం రంజీల్లో సెంచరీ బాదిన తిలక్ వర్మ.. భారత టీ20 జట్టులో మిడిల్ ఆర్డర్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ, అఫ్గానిస్థాన్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అతని బ్యాట్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు.

7 / 7
ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా తిలక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఇలా ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు టీమ్ ఇండియాలో పేలవ ఫామ్ తో సతమతమవుతున్న తిలక్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.