IND vs WI: బూమ్రా రికార్డ్‌పై హార్దిక్ పాండ్యా కన్ను.. మరో వికెట్ తీస్తే ఆ లిస్టులోకి..

|

Aug 06, 2023 | 10:46 AM

IND vs WI 2nd T20: భారత్, వెస్టిండీస్ జట్లు తమ 5 టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం రెండో మ్యాచ్‌లో తలపడనున్నాయి. తొలి మ్యాచ్ ఓడిన టీమిండియా రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ని సమం చేయాలనే యోచనలో ఉంది. అయితే టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం బూమ్రా రికార్డ్‌పై కన్నేశాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న హార్దిక్ బూమ్రా రికార్డును బ్రేక్ చేస్తే బౌలర్ల లిస్టులో నాల్గో స్థానానికి చేరుకుంటాడు.

1 / 5
IND vs WI 2nd T20: వెస్టిండీస్‌తో భారత్ ఆదివారం రెండో టీ20 మ్యాచ్‌లో తలపడుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో యార్కర్ కింగ్ జస్ప్రీత్ బూమ్రా రికార్డ్‌ని బ్రేక్ చేసే దిశగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అడుగులు చేస్తున్నాడు.

2 / 5
భారత్ తరఫున 60 మ్యాచ్‌లు ఆడిన బూమ్రా  ఇప్పటివరకు 70 వికెట్లు పడగొట్టాడు. అలాగే 88 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ కూడా 70 వికెట్లు తీసి, బూమ్రాతో సమానంగా ఉన్నాడు. అంటే బూమ్రాను అధిగమించేందుకు హార్దిక్ ఒక్క వికెట్ తీస్తే సరిపోతుంది.

3 / 5
ఇంకా వీరిద్దరూ కూడా ఇప్పుడు భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన ఆటగాళ్లుగా 4వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో హార్దిక్ నేటి మ్యా్చ్‌లో ఒక్క వికెట్ తీస్తే బూమ్రాను 5వ స్థానానికి నెట్టి, 4వ స్థానాన్ని పూర్తిగా తన సొంతం చేసుకుంటాడు.

4 / 5
ఇక భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 76 టీ20 మ్యాచ్‌లు ఆడిన చాహల్ మొత్తం 93 వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు.

5 / 5
అలాగే 87 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ 90 వికెట్లు తీసి 2వ స్థానంలో.. రవిచంద్రన్ అశ్విన్ 87 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.