Joe Root: భారత్‌లో సిరీస్ ఓడిపోయినా.. సచిన్, పాంటింగ్ రికార్డులు బ్రేక్ చేసి వెళ్లిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్..

|

Mar 11, 2024 | 7:15 AM

Joe Root Records: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాలలో భారత్‌తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓడిపోయినా.. జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో 2వ ఇన్నింగ్స్‌లో రూట్ బాధ్యతాయుతంగా ఆడి 84 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో జో రూట్ భారత్‌పై ప్రత్యేక రికార్డును లిఖించాడు.

1 / 5
ధర్మశాలలో భారత్‌తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓడిపోయినా.. జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో 2వ ఇన్నింగ్స్‌లో రూట్ బాధ్యతాయుతంగా ఆడి 84 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో జో రూట్ భారత్‌పై ప్రత్యేక రికార్డును లిఖించాడు. అది కూడా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం విశేషం.

2 / 5
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ భారత్‌పై టెస్టు క్రికెట్‌లో అత్యధిక 50+ స్కోర్‌లు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. టీమ్ ఇండియాపై 29 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పాంటింగ్ 20 సార్లు 50+ పరుగులు చేశాడు.

3 / 5
ఇప్పుడు జో రూట్ 21వ సారి 50+ పరుగులు చేసి భారత్‌పై కొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాపై 30 మ్యాచ్‌లు ఆడిన రూట్ 10 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు సాధించాడు. దీని ద్వారా 50+ 21 సార్లు స్కోర్ చేసి రికార్డు సృష్టించాడు.

4 / 5
దీంతో పాటు ఈ సిరీస్‌తో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా జో రూట్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 32 టెస్టు మ్యాచ్‌ల్లో మొత్తం 2535 పరుగులు చేశాడు.

5 / 5
ఇప్పుడు జో రూట్ 30 టెస్టు మ్యాచ్‌ల్లో మొత్తం 2846 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఇండో-ఇంగ్లండ్ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.