Sachin Tendulkar: నేషనల్‌ ఐకాన్‌గా సచిన్‌ టెండూల్కర్‌.. మాస్టర్‌ బ్లాస్టర్‌కు ఎన్నికల సంఘం కీలక బాధ్యతలు

|

Aug 22, 2023 | 6:52 PM

ఈ నేపథ్యంలో సచిన్‌ క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ఈ క్రికెట్‌ దిగ్గజాన్ని నేషనల్‌ ఐకాన్‌గా నియమించింది. సుమారు మూడేళ్ల పాటు ఈ కీలక పదవిలో కొనసాగనున్నారు సచిన్‌ టెండూల్కర్‌. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

1 / 5
సచిన్ టెండూల్కర్...  ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన ఈ క్రికెట్‌ దిగ్గజానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా యువతలోనూ మాస్టర్‌ బ్లాస్టర్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉంది.

2 / 5
ఈ నేపథ్యంలో సచిన్‌ క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ఈ క్రికెట్‌ దిగ్గజాన్ని నేషనల్‌ ఐకాన్‌గా నియమించింది. సుమారు మూడేళ్ల పాటు ఈ కీలక పదవిలో కొనసాగనున్నారు సచిన్‌.

3 / 5
ఈ ఒప్పందం ప్రకారం ఓటింగ్‌ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ.. దేశవ్యాప్తంగా ఓటర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో సచిన్‌ టెండూల్కర్‌ భాగం కానున్నారు. దీనికి సంబంధించి ఈసీ, సచిన్‌ల మధ్య బుధవారం కీలక ఒప్పందం జరుగనుంది.

4 / 5
 ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ సమక్షంలో సచిన్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరగనుంది.

5 / 5
గ‌తంలో పంక‌జ్ త్రిపాఠి, ఎంఎస్ ధోనీ, ఆమిర్ ఖాన్‌, మేరీ కోమ్‌ తదితర సినీ, స్టోర్ట్స్‌ సెలబ్రిటీలు ఎన్నికల సంఘం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓటింగ్‌పై తమదైన శైలిలో ప్రచారం నిర్వహించారు.