
కామన్వెల్త్ గేమ్స్ 2022 మహిళల క్రికెట్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

కాగా ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా (పురుషులు, మహిళల క్రికెట్‌లో కలిపి) సరికొత్త రికార్డు (42 విజయాలు) నెలకొల్పింది.

ఈ మ్యాచ్‌కు ముందు టీ20ల్లో టీమిండియా తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మిస్టర్‌కూల్ మహేంద్ర సింగ్ ధోని (41 విజయాలు) ఉండేవాడు. ఇప్పుడా రికార్డును బద్దలు కొట్టింది కౌర్.

జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 30 విజయాలతో మూడో స్థానంలో ఉండగా.. ప్రస్తుత సారథి రోహిత్ శర్మ 27 విజయాలతో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.

కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ మరో రికార్డు సృష్టించింది. CWG చరిత్రలో హాఫ్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాపై ఆమె 52 రన్స్ చేసింది.