
రికీ పాంటింగ్: ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ 2003, వరల్డ్ కప్ 2007 టైటిల్స్‌ను అందించిన కంగారుల మాజీ సారధి.. మెగా టోర్నీ చరిత్రలో తిరుగులేని కెప్టెన్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 29 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను ముందుండి నడిపించిన పాంటింగ్ ఏకంగా 26 మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాన్ని అందించాడు.

క్లైవ్ లాయిడ్: క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్‌గా ప్రసిద్ధి పొందిన క్లైవ్ లాయిడ్.. వెస్టిండీస్‌కి 1975 వరల్డ్ కప్(ప్రారంభ టోర్నమెంట్), 1979 వరల్డ్ కప్‌లను అందించాడు. కెప్టెన్‌గా మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన క్లైవ్ వెస్టిండీస్‌ని 15 వన్డేల్లో గెలిపించాడు.

స్టీఫెన్ ఫ్లెమింగ్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ లిస్టు రెండో స్థానంలో ఉన్నాడు. బ్లాక్ క్యాప్స్‌కి మొత్తం 27 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఫ్లెమింగ్ జట్టును 16 సార్లు గెలిపించాడు.

ఎంఎస్ ధోని: వన్డే వరల్డ్ కప్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్‌గా ఎంఎస్ ధోని నాలుగో స్థానంలో ఉన్నాడు. మైదానంలో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించే ధోని భారత కెప్టెన్‌గా 17 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడి 14 వన్డేల్లో విజయం సాధించాడు.

ఇమ్రాన్ ఖాన్: పాకిస్తాన్‌కి 1992 వరల్డ్ కప్‌ని అందించిన ఇమ్రాన్ ఖాన్.. మెగా టోర్నీ చరిత్రలో తిరుగులేని 5వ కెప్టెన్‌గా ఉన్నాడు. మొత్తం 22 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ జట్టును నడిపించిన ఇమ్రాన్ 14 వన్డేల్లో గెలిచాడు.