Team India: సెంచరీ, హాఫ్ సెంచరీ లేకుండానే పరుగుల వర్షం.. ప్రపంచ రికార్డు సృష్టించిన భారత క్రికెటర్.!

Updated on: Apr 20, 2026 | 8:35 PM

Most ODI Runs Without Half Century: క్రికెట్ ప్రపంచంలో బ్యాటర్లు సెంచరీలు, అర్ధ సెంచరీలతో రికార్డులు సృష్టించడం మనం చూస్తుంటాం. కానీ, ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయకుండా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వింత రికార్డు కొందరు ఆటగాళ్ల పేరిట ఉంది. ఈ జాబితాలో ఒక భారత దిగ్గజం అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

1 / 6
Most ODI Runs Without Half Century: సాధారణంగా ఏ బ్యాటర్ అయినా క్రీజులోకి వస్తే కనీసం ఒక యాభై పరుగులైనా చేయాలని ఆరాటపడతాడు. అయితే, అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో ఐదుగురు ఆటగాళ్లు మాత్రం ఒక్క సెంచరీ లేదా అర్ధ సెంచరీ చేయకుండానే వందలాది పరుగులు సాధించారు. వీరిలో బౌలర్లుగా రాణించిన వారే ఎక్కువగా ఉండటం విశేషం. ఆ టాప్ - 5 ఆటగాళ్ల వివరాలు ఓసారి చూద్దాం..

2 / 6
1. హర్భజన్ సింగ్ (భారత్): భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ వింత రికార్డులో మొదటి స్థానంలో ఉన్నాడు. తన సుదీర్ఘ వన్డే కెరీర్‌లో భజ్జీ మొత్తం 236 మ్యాచ్‌లు ఆడి 1237 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ కానీ, అర్ధ సెంచరీ కానీ లేదు. వన్డేల్లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 49 పరుగులు. తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న హర్భజన్, బౌలింగ్‌లో మాత్రం 269 వికెట్లు తీసి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు.

3 / 6
2. పాల్ స్ట్రాంగ్ (జింబాబ్వే): జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్ పాల్ స్ట్రాంగ్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఆయన 95 వన్డేల్లో మొత్తం 1090 పరుగులు సాధించాడు. ఆయన అత్యధిక స్కోరు 47 పరుగులు. లెగ్ స్పిన్నర్‌గా రాణించిన పాల్, బ్యాటింగ్‌లోనూ కీలక సమయంలో పరుగులు జోడించేవారు కానీ ఎప్పుడూ యాభై మార్కును అందుకోలేదు.

4 / 6
3. వకార్ యూనిస్ (పాకిస్థాన్): పాకిస్థాన్ స్పీడ్ గన్ వకార్ యూనిస్ బౌలింగ్‌లో ఎందరో బ్యాటర్లను వణికించాడు. కానీ, బ్యాటింగ్‌లో ఆయన పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. 262 వన్డేల్లో ఆయన 969 పరుగులు చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేని ఆయన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు 37 పరుగులు. బౌలింగ్‌లో 416 వికెట్లు తీసిన రికార్డు ఈయన సొంతం.

5 / 6
4. అనిల్ కుంబ్లే (భారత్): భారత దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సైతం ఈ జాబితాలో ఉన్నాడు. కుంబ్లే 271 వన్డేల్లో 938 పరుగులు చేశాడు. వికెట్ల వేటలో 337 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, బ్యాటింగ్‌లో ఆయన హైయెస్ట్ స్కోరు కేవలం 26 పరుగులు మాత్రమే. జట్టు అవసరమైనప్పుడు క్రీజులో నిలబడి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పేవాడు.

6 / 6
5. రోజర్ హార్పర్ (వెస్టిండీస్): వెస్టిండీస్ మాజీ ఆఫ్ స్పిన్నర్ రోజర్ హార్పర్ 105 మ్యాచ్‌ల్లో 855 పరుగులు చేశాడు. ఆయన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు 45 పరుగులు (నాటౌట్). ఈయన కూడా తన కెరీర్‌లో ఒక్కసారి కూడా యాభై పరుగుల మైలురాయిని దాటలేకపోయాడు.

Follow Us