
ఏ క్రికెట్ జట్టుకైనా కెప్టెన్ కీలక పాత్ర పోషిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ప్రదర్శన ద్వారా ఇతర ప్లేయర్లకు ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తుంటారు. ఈ కోవకే చెందిన ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లో దీనిని నిరూపించింది.

2025 WBBL సీజన్ ఆదివారం, నవంబర్ 9న ప్రారంభమైంది. సిడ్నీ సిక్సర్స్ తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. గత ఏడు సంవత్సరాలుగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సిక్సర్స్, ఆస్ట్రేలియన్ స్టార్ గార్డనర్‌ను తమ కొత్త కెప్టెన్‌గా నియమించింది.

గార్డ్నర్ కెప్టెన్సీ అరంగేట్రం కూడా ఆకట్టుకుంది. తన ఆఫ్-స్పిన్‌లో ఐదుగురు పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చింది. గార్డ్నర్ నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. పెర్త్‌ను కేవలం 109 పరుగులకే ఆలౌట్ చేసింది.

సిడ్నీ వికెట్ కోల్పోకుండా ఈ లక్ష్యాన్ని చేరుకుంది. కేవలం 77 బంతుల్లోనే విజయం సాధించింది. ఎల్లీస్ పెర్రీ (47), సోఫియా డంక్లీ (61) ల పవర్ ఫుల్ ఇన్నింగ్స్‌లతో సిడ్నీ కేవలం 12.5 ఓవర్లలో 10 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

గార్డనర్ ఇటీవల ICC మహిళల ప్రపంచ కప్ 2025లో అద్భుతంగా రాణించింది. ఆస్ట్రేలియన్ స్టార్ ఈ టోర్నమెంట్‌లో రెండు సెంచరీలతో సహా 328 పరుగులు చేసింది. 7 వికెట్లు కూడా పడగొట్టింది. అయితే, ఈసారి ఆమె జట్టును సెమీ-ఫైనల్స్ దాటించలేకపోయింది.