Asia Cup 2023: ఆసియా కప్ టోర్నీలో టాప్ 5 పరుగుల వీరులు.. లిస్టులో భారత్ నుంచి ఒక్కరే..

|

Sep 18, 2023 | 12:16 PM

Asia Cup 2023: భారత్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ దేశాల మధ్య జరిగిన 2023 ఎడిషన్‌‌లో రోహిత్ సేన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా లంకపై చెలరేగడంతో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ 2023 టోర్నీ విజయవంతంగా ముగిసింది. మరి ముగిసిన ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల లిస్టులో ఎవరెవరు ఉన్నారో తెలుసా..? 

1 / 5
ఆసియా కప్ 2023 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా యువ ప్లేయర్ శుభమాన్ గిల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గిల్ 6 మ్యాచ్‌ల్లో 75.50 సగటుతో 302 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 

2 / 5
2023 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు. మెండీస్ 6 మ్యాచ్‌ల్లో 3 అర్థ సెంచరీలు, 45 యావరేజ్‌తో 270 పరుగులు చేశాడు.

3 / 5
శ్రీలంకకు చెందిన సదీర సమర విక్రమ ఈ లిస్టు మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ఆసియా కప్‌లో సమర విక్రమ 6 మ్యాచ్‌ల్లో 2 అర్థ సెంచరీలు, 35.83 సగటుతో 215 పరుగులు చేశాడు.

4 / 5
ఈ లిస్టులో పాకిస్తాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా ఉన్నాడు. టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన బాబర్ పసికూన నేపాల్‌పై సాధించిన సెంచరీతో సహా 51.75 సగటుతో మొత్తం 215 పరుగులు చేశాడు.

5 / 5
2023 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా 5వ స్థానంలో పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్ తాను ఆడిన 5 మ్యాచ్‌ల్లో 97.50 సగటుతో మొత్తం 195 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రిజ్వాన్ 2 అర్థ సెంచరీలు కూడా సాధించాడు. 